మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధర
దేశంలో ఈరోజు పది గ్రాముల బంగారం ధరపై రూ.250లు పెరిగింది వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది.
బంగారం అంటే అందరికీ క్రేజే. దానిపై మోజు మహిళలకు అంతా ఇంతా కాదు. తమ ఇంట్లో కొంతైనా బంగారం ఉండాలని కోరుకునే వారు ఏ స్థాయిలో ఉన్న భారతీయ మహిళ అయినా కోరుకుటుంది. అందువల్లనే ప్రపంచదేశాల్లో కన్నా భారత్ లో భారత్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు పెళ్లిళ్లు, శుభకార్యాలయాల సమయంలోనే బంగారాన్ని కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు సీజన్ లతో సంబంధం లేకుండా కొనుగోళ్లు ఉంటున్నాయి. అందుకే బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల ప్రభావం బంగారం ధరల హెచ్చు, తగ్గుదలపై ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు ఇలా....
దేశంలో ఈరోజు పది గ్రాముల బంగారం ధరపై రూ.250లు పెరిగింది వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,120 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కిలో 66,000 రూపాయలుగా ఉంది.