వైష్ణోదేవీ ఆలయంలో మృతుల కుటుంబాలకు ఆసరా

జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

Update: 2022-01-01 04:10 GMT

జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయం నిధి నుంచి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, క్షతగాత్రులకు యాభై వేల రూపాయలను ప్రధాని ప్రకటించారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.

పది లక్షల రూపాయలు....
ఈ ప్రమాదంపై లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదిలక్షల రూపాయలు, క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలను ప్రకటించారు. వైష్ణోదేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగి పన్నెండు మంది మృతి చెందారు. కొత్త ఏడాది సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


Tags:    

Similar News