‍Narendra Modi : ప్రజలు మెచ్చారు.. విశ్వసించారు..అందుకే ఈ విజయం

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు;

Update: 2024-06-24 05:28 GMT
‍Narendra Modi : ప్రజలు మెచ్చారు.. విశ్వసించారు..అందుకే ఈ విజయం
  • whatsapp icon

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కొత్తగా ఎంపికై పార్లమెంటుకు వస్తున్న పార్లమెంటు సభ్యులకు ఆయన స్వాగతం పలికారు. నూతన పార్లమెంటులో 18వ లోక్‌సభ సమావేశమవుతుందన్న ఆయన 2047 వికసిత్ భారత్ లక్ష్యాంగా భారత్ ముందుకు వెళుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

రేపటితో ఎమెర్జెన్సీకి...
తనకు మూడోసారి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారన్న ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లలో తాము అనుసరించిన విధానాలను ప్రజలు మెచ్చారన్నారు. విశ్వసించారన్నారు. అందుకే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని తెలిపారు. ఎమెర్జెన్సీకి రేపటితో యాభై ఏళ్లు పూర్తవుతుందని, అది దేశానికి ఒక మచ్చలాంటిదని, అప్పటి తప్పు పునరావృతం కాకూడదని మోదీ ఆకాంక్షించారు.


Tags:    

Similar News