మోదీ పర్యటన భద్రతాలోపంపై నేడు విచారణ

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన లోపాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2022-01-10 03:49 GMT

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన లోపాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయవాది మణీందర్ సింగ్ ప్రధాని భద్రతాలోపాలపై దర్యాప్తు జరిపించాలని పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనకు వెళ్లారు.

పంజాబ్ ప్రభుత్వం.....
అయితే రోడ్డు మార్గం ద్వారా వెళుతున్న ప్రధాని కాన్వాయ్ ను కొందరు అడ్డుకున్నారు. ఇరవై నిమిషాలు ప్రధాని కాన్వాయ్ నిలిచిపోయింది. దీంతో పర్యటనను రద్దు చేసుకుని ప్రధాని మోదీ వెనుదిరిగారు. భద్రతాలోపం వల్లనే ఇలా జరిగిందన్న విమర్శలు విన్పిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం నిర్ణయం వెలువరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. పంజాబ్ ప్రభుత్వం మాత్రం తమ తప్పేమీ లేదని చెప్పింది.


Tags:    

Similar News