ఎయిమ్స్ కు లాలూ ప్రసాద్ యాదవ్ ..ఎమెర్జెన్సీ వార్డులో?

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.;

Update: 2021-11-26 14:23 GMT
lalu prasad yadav, fodder scam case, cbi, bihar
  • whatsapp icon

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఇటీవలే ఎయిమ్స్ లో చేరి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. పశు దాణా కుంభకోణం కేసులో జైలు జీవితం గడుపుతున్నప్పుడే లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. బీహార్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.

ఎమెర్జెన్సీ వార్డులోకి...
మరోసారి ఆయన అనారోగ్యం పాలు కావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎయిమ్స్ లోని ఎమెర్జెన్సీ వార్డులో లాలూ ప్రసాద్ యాదవ్ కు చికిత్స అందిస్తున్నారు. రేపు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశముంది.


Tags:    

Similar News