పేద విద్యార్థులకు నెలకి రూ.1000 నుండి రూ.12 వేల స్కాలర్ షిప్..!

ప్ర‌తిభ‌గ‌ల, ఆర్ధికంగా వెనుక‌బ‌డిన పేద‌విద్యార్ధుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నేష‌న‌ల్ మీన్స్ క‌మ్ మెరిట్ స్కాల‌ర్ షిప్ (ఎన్ఎంఎంఎస్) ప‌ధ‌కాన్ని అమ‌లుచేస్తోంది. పాఠ‌శాల స్థాయి నుండి అందే ఈప‌థ‌కం నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కూ చ‌దివే పేద విద్యార్ధుల‌ను ప్రోత్స‌హించేందుకు రూపొందించారు.

Update: 2023-08-31 12:57 GMT

పేద విద్యార్థులకు నెలకి రూ.1000 నుండి రూ.12 వేల స్కాలర్ షిప్..!

ప్ర‌తిభ‌గ‌ల, ఆర్ధికంగా వెనుక‌బ‌డిన పేద‌విద్యార్ధుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నేష‌న‌ల్ మీన్స్ క‌మ్ మెరిట్ స్కాల‌ర్ షిప్ (ఎన్ఎంఎంఎస్) ప‌ధ‌కాన్ని అమ‌లుచేస్తోంది. పాఠ‌శాల స్థాయి నుండి అందే ఈప‌థ‌కం నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కూ చ‌దివే పేద విద్యార్ధుల‌ను ప్రోత్స‌హించేందుకు రూపొందించారు. ఇందుకోసం అర్హ‌త ప‌రీక్ష రాయాలి. ఇందులో ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన విద్యార్ధుల‌ను ఉప‌కార వేత‌నాన్ని పొందేందుకు ఎంపిక చేస్తారు.

ఈ ప‌రీక్ష‌లో ఎంపికైన విద్యార్ధుల‌కు నెల‌కు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.12,000 స్కాల‌ర్ షిప్ గా అందిస్తారు. ఇది 9వ త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ అంటే నాలుగేళ్ల‌పాటు స్కాల‌ర్ షిప్ అందుతుంది. దీనిద్వారా ఒక్కో విద్యార్ధికి రూ.48,000 ల‌బ్ధి చేకూర‌నుంది. 2023-24 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించిన నోటిఫికేష‌న్ ఇటీవ‌ల విడుద‌లైంది. ఈ ప‌రీక్ష రాసేందుకు ప్ర‌స్తుతం 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్ధులు అర్హులు. ఆన్ లైన్ ద్వారా విద్యార్ధులు సెప్టెంబ‌రు 15 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకుని 16లోపు ఫీజు చెల్లించాలి. ద‌ర‌ఖాస్తుల‌ను సంబంధిత పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయులకు అంద‌జేయాల్సి ఉంటుంది.

7వ త‌ర‌గ‌తిలో క‌నీసం 55శాతం మార్కులు సాధించిన విద్యార్ధులు ప‌రీక్ష రాయ‌డానికి అర్హులు. తుది ఎంపిక స‌మ‌యం నాటికి 8వ త‌ర‌గ‌తిలో 55శాతం మార్కులు పొంది ఉండాలి. జిల్లా ప‌రిష‌త్, ప్ర‌భుత్వ‌, మున్సిప‌ల్, ఎయిడెడ్, మండ‌ల ప‌రిష‌త్ ప్రాధ‌మికోన్న‌త పాఠ‌శాల‌లు, మోడ‌ల్ పాఠ‌శాల‌ల్లో విద్యార్ధులు చ‌దువుతుండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 ల‌క్ష‌ల‌కు మించ‌కూడ‌దు. జ‌న‌ర‌ల్, బీసీ విద్యార్ధులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

విద్యార్ధులు రెండు ప‌రీక్ష‌ల్లో స‌గ‌టున జ‌న‌ర‌ల్ అభ్య‌ర్ధుల‌కు 40శాతం (36)మార్కులు,ఎస్సీ,ఎస్టీ విద్యార్ధు 32శాతం (29)మార్కుల‌ను క‌నీస అర్హత మార్కులుగా నిర్ణ‌యించారు. జిల్లాను యూనిట్ గా తీసుకుని రాష్ట్ర‌ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం కేట‌గిరీల‌వారీగా బీసీ,ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగుల‌కు రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం అర్హ‌త పొందిన విద్యార్ధుల మెరిట్ జాబితా త‌యారు చేస్తారు.

మెంట‌ల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్) పేప‌ర్లో వెర్భ‌ల్,నాన్ వెర్భ‌ల్ రీజ‌నింగ్, క్రిటిక‌ల్ ధింకింగ్ నుంచి 90 ప్ర‌శ్న‌లు 90 మార్కులుకు ఉంటాయి. స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(శాట్) పేప‌ర్లోను 90 ప్ర‌శ్న‌లు 90 మార్కులకు ఉంటాయి. 7,8 త‌ర‌గ‌తుల‌స్ధాయిలో బోధించిన సైన్స్,సోష‌ల్,గ‌ణితం స‌బ్జెక్టుల నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఒక్కో పేప‌ర్ కు 90 నిమిషాలు స‌మ‌యాన్ని కేటాయిస్తారు.

Tags:    

Similar News