Sabarimala : అయ్యప్ప దర్శనానికి 14 గంటల సమయం
శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి 14 గంటల సమయం పడుతుంది
శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మండల పూజలు ప్రారంభం కావడంతో ఎక్కువ మంది భక్తులు అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల తరలి వస్తున్నారు. ట్రావెన్ కోర్ బోర్డు ఎన్ని చర్యలు తీసుకున్నా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పది నుంచి పథ్నాలుగు గంటల సమయం దర్శనానికి పడుతుందని అధికారులు చెబుతున్నారు. ముందుగా వర్చువల్ గా బుక్ చేసుకునే పద్ధతిని ప్రవేశపెట్టినా కూడా భక్తుల రద్దీని నియంత్రించడం సాధ్యం కావడం లేదు.
భక్తులు పోటెత్తడంతో...
అయ్యప్ప మాల సీజన్ కావడంతో స్వాములు తండోపతండాలుగా అయ్యప్పను దర్శించుకుంటున్నారు. తొలి తొమ్మిది రోజుల్లోనే సుమారు ఆరు లక్షలమంది భక్తులు కొండకు వచ్చారని అంచనా. గత ఏడాది ఇదే కాలంలో 3 లక్షల పైచిలుకు భక్తులు మాత్రమే వచ్చారని, ఈసారి రద్దీ చాలా ఎక్కువగా ఉందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తజనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ట్రావెన్ కోర్ బోర్డు అధికారులు తెలిపారు. స్వామి దర్శనం త్వరగా పూర్తయ్యేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకంటున్నామని తెలిపారర.