ఒమిక్రాన్ కు వ్యాక్సిన్... గుడ్ న్యూస్ చెప్పిన రష్యా
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ కు అడ్డుకట్ట వేయడానికి రష్యా నడుంబిగించింది
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ కు అడ్డుకట్ట వేయడానికి రష్యా నడుంబిగించింది. ఇప్పటికే కోవిడ్ 19 వ్యాక్సిన్ ను రూపొందించే పనిలో రష్యా పడింది. ఒమిక్రాన్ వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కొత్త వెర్షన్ ను అభివృద్ధి చేయడాన్ని ప్రారంభించినట్లు గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయోలజీ ప్రకటించడం విశేషం.
ఈ వేరియంట్ ను....
సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ ను కనుగొన్నారు. ఇది అత్యంత వేగంగా ప్రయాణిస్తుందని, డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. దీంతో రష్యా సుత్నిక్ వ్యాక్సిన్ కొత్త వెర్షన్ ను ఒమిక్రాన్ వేరియంట్ ను తట్టుకునేలా తయారు చేసే పనిలో పడింది.