భారత్ లో 32కు చేరుకున్న ఒమిక్రాన్ కేసులు

మహారాష్ట్రలో కొత్తగా ఏడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో ఈ కేసుల సంఖ్య 32కు చేరుకుంది.

Update: 2021-12-11 01:26 GMT

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయం వెంటాడుతుంది. ఇప్పటికే 57 దేశాల్లో ఈ వేరియంట్ విస్తరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఈ వేరియంట్ వ్యాప్తి చెందకుండా ప్రపంచంలోని అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. దాదాపు పన్నెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. అయినా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆగడం లేదు.

మహారాష్ట్రలోనే ఎక్కువగా....
భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. మహారాష్ట్రలో కొత్తగా ఏడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో ఈ కేసుల సంఖ్య 32కు చేరుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవువుతున్నాయి. మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా ఉండటం ఆందోళన కల్గిస్తుంది. పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర రాకపోకలపై నిషేధం విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటి వరకూ రాజస్థాన్ లో 9, గుజరాత్ లో మూడు, కర్ణాటకలో రెండు, ఢిల్లీలో ఒకటి, మహారాష్ట్రలో పదిహేడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News