Trains cancelled : నేడు రద్దయిన రైళ్లు ఇవే
భారీ వర్షాల కారణంగా ఇరవై రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది
భారీ వర్షాల కారణంగా అనేక రైళ్లను ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అనేక చోట్ల ట్రాక్ లు దెబ్బతినడంతో పాటు కొన్ని చోట్ల ట్రాక్ లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల రైల్వే ట్రాక్ లపై వరద నీరు ఇప్పటికీ ప్రవహిస్తుంది. అయితే మరమ్మతు పనులు చేపట్టినా ఈరోజు సాయంత్రానికి కాని పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈరోజు మరో ఇరవై రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇరవై రైళ్లు...
దీంతో మరో ఇరవై రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు రద్దు చేసినట్లు ప్రకటించారు. హౌరా - బెంగళూరు, హౌరా - పుదుచ్చేరి, హౌరా - చెన్నయ్ సెంట్రల్, శాలిమర్ - త్రివేండ్రం, హాటియా - బెంగళూరు, ఎర్నాకులం - హాటియా, జైపూర్ - కోయంబత్తూర్, న్యూ ఢిల్లీ - విశాఖపట్నం, ధన్‌హాడ్ - కోయంబత్తూరు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరింది.