అయోధ్యలో సూర్యకిరణాలు తాకేలా

అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం' కోసం ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు.

Update: 2024-04-17 04:56 GMT

అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం' కోసం ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు అయోధ్య లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు బాలరాముడి నుదుటిపై ప్రసరించనున్నాయి. ఇందుకోసం సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది.

మూడో అంతస్థు నుంచి...
రామమందిరంలోని మూడో అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ఏటా రామనవమి రోజు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఇందుకోసం కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలు అమర్చారు. వీటిలో ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తును వినియోగించలేదని సీబీఆర్ఐ తెలిపింది.


Tags:    

Similar News