50వేలు దాటిన యాక్టివ్ కేసులు

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో భారత్‌లో 10,753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2023-04-15 05:59 GMT

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో భారత్‌లో 10,753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో కోవిడ్ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుంది. దీనిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. లేకుంటే రానున్న రెండు వారాల్లో కేసుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశముందని తెలిపింది.

మరణాలు కూడా...
తాజాగా భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కు చేరుకుంది. ప్రధానంగా ఢిల్లీలో అత్యధికంగా కరోనాతో ఆరుగురు మరణించారు. మహారాష్ట్రలో నలుగురు, రాజస్థాన్‌లో ముగ్గురు, ఛత్తీస్‌ఘడ్, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఒక్కొరు చొప్పున కోవిడ్ బారిన మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. పాజిటివిటీ రేటు 6.78 శాతంగా నమోదయిందని తెలిపారు.


Tags:    

Similar News