Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో "సుప్రీం" సంచలన తీర్పు

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో ఉన్న పదకొండు మంది దోషులకు క్షమాబిక్షను రద్దు చేసింది

Update: 2024-01-08 05:48 GMT

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో ఉన్న పదకొండు మంది దోషులకు క్షమాబిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. బిల్కిన్ బానో కుటుంబంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానో పై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

క్షమాబిక్ష అధికారం...
అయితే ఈ కేసులో పదకొండు మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. అయితే గుజరాత్ ప్రభుత్వం వారందరికీ క్షమాబిక్ష పెట్టింది. వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. బాధితురాలు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును విచారించిన ధర్మాసనం బాల్కిన్ బానో కేసు విచారణకు అర్హత ఉందని పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాబిక్ష ప్రసాదించే అధికారం లేదని కూడా స్పష్టం చేసింది. దీంతో పదకొండు మంది నిందితులు తిరిగి జైలుకు వెల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.



Tags:    

Similar News