Delhi: కేజ్రీవాల్ కి సుప్రీం కోర్టు, బెయిల్ మంజూరు చేసింది...

ఢిల్లీ మధ్యం కుంభకోణం సంబంధించిన ఈడీ , సీబీఐ కేసులో అరెస్టు అయి,తీహార్ జైలులో ఉంటున్న.. అరవింద్ కేజ్రీవాల్ కి

Update: 2024-09-13 12:30 GMT

ఢిల్లీ మధ్యం కుంభకోణం సంబంధించిన ఈడీ , సీబీఐ కేసులో అరెస్టు అయి,తీహార్ జైలులో ఉంటున్న.. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కిఎట్టకేలకు చాలా రోజుల మరియు వాదనల తర్వాత సుప్రీం కోర్టు , ఇద్దరు వ్యక్తుల షూరిటీ మరియు పది లక్షల పూచికతో బెయిల్ మంజూరు చేసింది...

ఇదే కేసులో ముద్దాయిగా అరెస్టు అయిన తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ,ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా...ఈ మధ్యే 166 రోజుల సుధీర్ఘ జైలు జీవితం గడిపిన తర్వాత ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో తీహార్ జైలు నుంచి విడుదల అయింది... కాగా తెలంగాణ రాజకీయ నాయకులలో ఇంత సుధీర్ఘంగా జైలు జీవితం గడిపిన మహిళగా మరియు రాజకీయ నాయకురాలిగా ఈమె నిలిచి పోయింది..!! కేజ్రీవాల్ అరెస్టు పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు నిస్తూ... కేజ్రీవాల్ అరెస్టు సరైనదే.... ఒక వ్యక్తిని ఇన్ని రోజులు బంధించడం అంటే..వారి హక్కులను కాల రాయడమే... మొదట కేజ్రీవాల్ ని మనీ లాండరింగ్ కేసులో మార్చి 21,2024 నా అరెస్టు చేసింది... ఆ కేసులో బెయిల్ మీద వచ్చిన కేజ్రీవాల్ ని ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో వెనువెంటనే.. జూన్ 26,2024 న సీబీఐ అరెస్టు చేసింది..

ఈడీ సీబీఐ లు అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్టు చేయడం సమంజసమే అయినప్పటికీ...ఆ అరెస్టు చేసిన సమయం సరైనది కాదు అని పేర్కొంది... మనీ లాండరింగ్ కేసులో ఈడీ నుంచి బెయిల్ మీద వచ్చిన కేజ్రీవాల్ ని.. మధ్యం కుంభకోణం కేసులో , సీబీఐ అరెస్టు చేయడం సరైనది కాదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు లో పేర్కొంది...!!

Tags:    

Similar News