Supreme Court : ఆర్టికల్ 370 రద్దుపై...కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన ధర్మాసనం
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది
ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పార్లమెంట నిర్ణయానని కొట్టి పారేయలేమని పేర్కింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా ధర్మాసనం అభిప్రాయ పడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. భారతదేశంలో కాశ్మీర్ విలీనమయినప్పుడు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని అభిప్రాయపడింది. కాశ్మీర్ కున్న ప్రత్యేక రాజ్యాంగం కేవలం వెసులుబాటుకోసమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటే కాని, శాశ్వతం కాదని చెప్పింది. ఆర్టికల్ 370 సమర్థనీయమేనని అభిప్రాయ పడింది. రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా సమర్ధనీయమేనని చెప్పింది. ఆర్టికల్ ౩౭౦ రద్దు సరైనదేనని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
ఆర్టికల్ ౩౭౦ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని అభిప్రాయపడింది. జమ్ముకాశ్మీర్ లో యుద్ధవాతావరణం ఉన్నందునే అక్కడ తాత్కాలికంగా ఆర్టికల్ ౩౭౦ని అమలు చేశారని పేర్కొంది. ఆర్టికల్ 370పై సెప్టంబరులో రిజర్వ్ చేసిన తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు తెలిపింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలను ప్రభుత్వం చేపట్టింది. తీర్పు రానుండటంతో జమ్మూకాశ్మీర్ లోని వివిధ పార్టీలకు చెందిన నేతలను గృహనిర్భంధంలోకి తీసుకుంది. రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించింది. కాశ్మీర్ భారతదేశంలో విలీనయిప్పుడు ప్రత్యేక హోదాలు ఏమీ లేవని కూడా సుప్రీంకోర్టు తెలిపింది.