ప్రధాని పర్యటన భద్రతాలోపంపై సుప్రీంలో?
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతాలోపంపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతాలోపంపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ విచారణ చేపట్టనున్నారు. పంజాబ్ పర్యటనలో భాగంగా నిన్న మోదీ అక్కడకు వెళ్లగా రైతులు అడ్డుకున్నారు. దాదాపు ఇరవై నిమిషాలు మోదీ కాన్వాయ్ వంతెనపైనే నిలిచిపోయింది. భద్రతా వైఫల్యం పూర్తిగా కొట్టొచ్చినట్లు కనపడింది. ఇరవై నిమిషాలు వేచి చూసిన మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని వెనుదిరిగి వచ్చారు.
ప్రభుత్వాలకు నోటీసులు...
ప్రాణాలతో బయటపడేసినందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ప్రధాని పర్యటనలో భద్రతాలోపంపై పంజాబ్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడుతుంది. తమ తప్పేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యులెవరో తేల్చాలంటూ న్యాయవాది మణీందర్ సింగ్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. రేపు దీనిపై విచారణ జరపనున్నారు.