Tamilnadu : తడిసిముద్దవుతున్న తమిళనాడు.. నీటమునిగిన ప్రాంతాలు.. సహాయక చర్యల కోసం?
తమిళనాడు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమవుతుంది. అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి
తమిళనాడు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమవుతుంది. అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాి. తిరునెల్వేలి, తూత్తుకుడితో పాటు దక్షిణ తమిళనాడులోని అనేక ప్రాంతాలు నీటిలో ఉన్నాయి. సహాయక చర్యలు ప్రారంభించారు. వరదల ధాటికి అనేక ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావడం లేదు. రహదారులన్నీ జలమయం కావడంతో బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు.
సహాయక చర్యలు...
నిన్న కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అంచనాలు వినపడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న దాదాపు ఎనిమిది వేల మందిని రక్షించారు. 84 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. రైళ్లను కూడా పలుచోట్ల నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.