గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర
ఈరోజు బంగారం ధరలు పది గ్రాముల పై రూ100లు తగ్గింది. కిలో వెండి పై రూ.300 ల తగ్గింది.
బంగారానికి ఎప్పుడూ వన్నె తగ్గదు. అంతే కాదు ధర కూడా తగ్గదు అన్నది నానుడి. పుత్తడికి భారత్ లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పసిడి అంటేనే భారతీయ మహిళలు బాగా ఇష్టపడతారు. ఒక గ్రాము బంగారాన్ని అయినా తమకు ఉన్న పరిధిలో కొనుగోలు చేయాలని తహతహలాడుతుంటారు. భారతీయ సంస్కృతిలో బంగారం ఒక భాగంగా మారింది. అందుకే బంగారం కొనుగోళ్లు ఎప్పుడూ తగ్గవు. ముఖ్యంగా భారత్ వంటి దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోళ్లు ఉండటంతో బంగారం ధరలు పైకి ఎగబాకుతూనే ఉంటాయి.
ధరలు ఇలా....
గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు బంగారం ధరలు పది గ్రాముల పై రూ100లు తగ్గింది. కిలో వెండి పై రూ.300 ల తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,980 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర 66.300 రూపాయలు అయింది.