బ్యాడ్ న్యూస్....బంగారానికి మళ్లీ రెక్కలు
ఈరోజు బంగారం ధరలు దేశంలో మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి
బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ముఖ్యంగా మహిళలు ఇష్టపడి కొనుగోలు చేసే వస్తువు కావడంతో దాని డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయని చెప్పాలి. భారతీయ సంప్రదాయంలో పెళ్లిళ్లకు ప్రధాన వస్తువుగా బంగారాన్ని భావిస్తుండటంతో కొనుగోళ్లు ఈ సీజన్ లో ఊపందుకుంటాయి. అందుకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బంగారం ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. అందుకే దానిని బంగారం అని అంటారు.
ధరలు ఇలా.....
తాజాగా ఈరోజు బంగారం ధరలు దేశంలో మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,930 రూపాయలకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర వంద రూపాయలు పెరిగడంతో ప్రస్తుతం మార్కెట్ లో రూ.47,600లుగా ఉంది. వివాహాలు ఎక్కువగా జరుగుతుండటంతో వెండి ధరల పెరుగుదల కూడా ఆగడం లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 61,400లు గా ఉంది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.