మరోసారి సివిల్ కోడ్... కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

హిజాబ్ వివాదం ముదురుతున్న వేళ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-02-11 06:55 GMT

హిజాబ్ వివాదం ముదురుతున్న వేళ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ దేశంలో యూనిఫాం, సివిల్ కోడ్ తేవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఒకే యూనిఫారం, సివిల్ కోడ్ ను తేవాలని గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిజాబ్ పై...
దేశంలో సివిల్ కోడ్ విషయంపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. దేశంలో హిందూ, ముస్లిం, ఇతర మతాల్లో విడాకులకు సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. కొంతకాలం క్రితం ముస్లింలు విడాకులు పొందే ట్రిపుల్ తలాక్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో గిరిరాజ్ సింగ్ సివిల్ కోడ్ తేవాలని వ్యాఖ్యానించడం వివాదంగా మారింది. హిజాబ్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.


Tags:    

Similar News