గుడ్ న్యూస్.. ఈ నాణేలు చెల్లుతాయి
పది రూపాయల నాణెం చెల్లుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో చెప్పారు.
పది రూపాయల నాణేలు చెల్లవని వ్యాపారులు చెబుతున్నారు. పది రూపాయల నాణెం ఇస్తే తిరస్కరిస్తున్నారు. దీంతో అసలు పది రూపాయల నాణెం చెల్లుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రజలు కూడా పది రూపాయల నాణేన్ని తీసుకునేందుకు అంగీకరించడం లేదు. పది రూపాయల నాణేన్ని రిజర్వ్ బ్యాంకు ముద్రించినా అవి చెల్లుబాటు కావన్న ప్రచారం జోరుగా సాగడంతో వ్యాపారులు, వినియోగదారులు ఎవరూ వాటిని తీసుకునేందుకు ఇష్టపడటం లేదు.
చెల్లుబాటులోనే...
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. పది రూపాయల నాణెం చెల్లుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో చెప్పారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముద్రించిన ఈ నాణెం చెల్లుబాటుపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని ఆయన కోరారు. చెల్లుబాటులోనే ఉందని, ఎవరైనా తీసుకోకపోతే ఫిర్యాదు చేయవచ్చని కూడా కేంద్ర మంత్రి తెలిపారు.