Aadhaar Card : ఆధార్ కార్డుపై వదంతులు నమ్మొద్దు

ఆధార్ కార్డుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది;

Update: 2024-05-26 07:08 GMT
Aadhaar Card : ఆధార్ కార్డుపై వదంతులు నమ్మొద్దు
  • whatsapp icon

ఆధార్ కార్డుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. జూన్ 14వ తేదీన తర్వాత ఆధార్ కార్డు పనిచేయదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. దీనిని UIDAI ఖండించింది. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దంటూ ఒక ప్రకటనలో తెలిపింది.

జూన్ 14వ తేదీ తర్వాత కూడా...
జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ కార్డు పనిచేస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్‌డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. గడువు తర్వాత అప్‌డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్‌డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పని చేయకపోవడం అనేది ఉండదని స్పష్టం చేసింది.


Tags:    

Similar News