పోలీసు అవతారమెత్తాడు.. ఈ అవసరాల కోసమేనట!

చాలా కాలంగా పోలీసు విభాగంలో చేరాలని అనుకునే వాడు

Update: 2024-09-09 03:01 GMT

డబ్బులు సంపాదించడం కోసం కొందరు పోలీసు అవతారం కూడా ఎత్తుతూ ఉంటారు. పోలీసుల్లా నటిస్తూ ప్రజలను భయపెడుతూ డబ్బులు లాక్కున్న ఘటనలు ఎన్నో జరిగాయి. మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని కోపం తెప్పిస్తాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కూడా ఓ వ్యక్తి పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. అయితే ఆ వ్యక్తి చేసింది నకిలీ యూనిఫాంతో ఉచితంగా సినిమాలు చూడడమే. అంతేకాకుండా రోడ్డు పక్కన షాపుల్లో హ్యాపీగా తినేసి, డబ్బు చెల్లించకుండా వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు బాగానే సాగింది కానీ, ఎవరికో అనుమానం వచ్చి రియల్ పోలీసులకు సమాచారం అందించారు. అంతే బహ్రైచ్‌లో నివాసం ఉంటున్న రోమిల్ సింగ్ అనే వ్యక్తిని యూపీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.


రోమిల్ సింగ్ చాలా కాలంగా పోలీసు విభాగంలో చేరాలని అనుకునే వాడు. కానీ అలా విఫలమయ్యాడు. ఆ తర్వాత లక్నోలోని చార్‌బాగ్ నుండి పోలీసు యూనిఫాం, బ్యాడ్జ్‌లను కొనుగోలు చేశాడు. దొంగ ID కార్డ్‌ను కూడా ముద్రించాడు. ఈ తప్పుడు గుర్తింపును ఉపయోగించి, అతను తరచుగా సినిమాలు చూడటానికి మల్టీప్లెక్స్‌లకు వెళ్లాడు. బిల్లులు చెల్లించకుండా స్థానిక తినుబండారాలలో తిన్నాడు. అతని చర్యలు అనుమానాన్ని రేకెత్తించాయి. పోలీసుల విచారణ సమయంలో రోమిల్ సింగ్ తాను బహ్రైచ్‌కు చెందినవాడినని, బారాబంకిలో ఉద్యోగం చేసానని చెప్పుకున్నాడు. నకిలీ ID కార్డును కూడా చూపించాడు. అయితే, పోలీసు డేటాబేస్‌లో అతని ఆధారాలను అధికారులు తనిఖీ చేసినప్పుడు ఫేక్ అని గుర్తించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) తూర్పు, శశాంక్ సింగ్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడానికి పోలీసులా నటించాడు, అయితే చివరికి అతని పథకం ఇప్పుడు బట్టబయలు అయింది. పోలీసులు రోమిల్ సింగ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రోమిల్ సింగ్ పోలీసు అధికారిగా నటిస్తూ ఇతర నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు


Tags:    

Similar News