స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో? పెరుగుతాయో చెప్పలేం. దానికి అనేక కారణాలు చెబుతుంటారు మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం వంటి కారణంగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయంటారు. ఇక వచ్చేది ఆషాఢ మాసం కావడంతో బంగారం కొనుగోళ్లు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకే పసిడి ప్రియులు ఆషాఢానికి ముందే కొనుగోలు చేస్తుంటారు.
మార్కెట్ లో ధరలు ఇలా....
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,980 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 66,600 రూపాయలుగా ఉంది.