యూట్యూబర్ గౌరవ్ తనేజా అరెస్ట్

ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌కు మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకోవల్సిందిగా

Update: 2022-07-10 06:29 GMT

ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ తనేజాను పోలీసులు అరెస్టు చేశారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు వేల సంఖ్యలో మెట్రో స్టేషన్‌ వద్ద గుమి గూడటంతో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు గౌరవ్‌ తనేజాను అదుపులోకి తీసుకున్నారు. 'ఫ్లైయింగ్‌ బీస్ట్‌ (Flying Beast), ఫిట్‌ మజిల్‌ టీవీ (Fit Muscle TV), రస్భరీ కే పాప (Rasbhari Ke Papa)' అనే యూట్యూబ్ ఛానెళ్లతో దేశ వ్యాప్తంగా ఫేమస్‌ అయ్యాడు గౌరవ్ తనేజా. శనివారం నాడు గౌరవ్ తనేజా పుట్టిన రోజు కావడంతో నోయిడాలోని సెక్షన్‌ 51 మెట్రో స్టేషన్‌లో బర్త్‌డే వేడుకలను జరుపుకోవాలని అనుకున్నాడు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌కు మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకోవల్సిందిగా పోస్ట్ పెట్టాడు. గౌరవ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3.3 మిలియన్ల, అతని భార్య రీతూకి 1.6 మినియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా మెట్రో స్టేషన్‌కు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు సకాలంలో ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నోయిడాలో విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు తనేజాను పోలీసులు మొదట అదుపులోకి తీసుకున్నారు. నోయిడా పోలీసులు పబ్లిక్ సర్వెంట్ ద్వారా కమ్యూనికేట్ చేసిన ఆర్డర్‌కు అవిధేయత చూపినందుకు అతన్ని అరెస్టు చేశారు. అరెస్టయిన కొన్ని గంటలకే గౌరవ్ తనేజా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. కోవిడ్‌ కేసుల దృష్ట్యా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. నిబంధనలకు వ్యతిరేకంగా వేడుకలు నిర్వహించినందుకు గానూ పోలీసులు వివిధ సెక్షన్ల కింద అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు.


Tags:    

Similar News