ఎక్కడకు వెళితే అక్కడ అంతేనా
2014 ఎన్నికలకు ముందు ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రమే. అదృష్టం కలిసి రావడంతో టిడిపి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న ఆయన తొలిప్రయత్నంలోనే విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత [more]
2014 ఎన్నికలకు ముందు ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రమే. అదృష్టం కలిసి రావడంతో టిడిపి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న ఆయన తొలిప్రయత్నంలోనే విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత [more]
2014 ఎన్నికలకు ముందు ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రమే. అదృష్టం కలిసి రావడంతో టిడిపి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న ఆయన తొలిప్రయత్నంలోనే విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత కట్ చేస్తే ఆయన దశ మరింతగా పెరిగింది. ఏకంగా మంత్రి అయిపోయారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి మంత్రిగా మారేందుకు కేవలం మూడు సంవత్సరాల టైం పడితే ఐదేళ్లకే ఆయన సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి చెందిన కేఎస్.జవహర్ పశ్చిమగోదావరిలో దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆయనకు అనూహ్యంగా టిడిపి సీటు దక్కింది.
కీలకమైన మంత్రి పదవి……
టిడిపిలో విజయం సాధించిన మూడేళ్ల తర్వాత జరిగిన ప్రక్షాళన లో బాబు కేబినెట్ లో కీలకమైన ఎక్సైజ్ శాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో స్థానిక పార్టీ క్యాడర్‌తో ఎంతో సమన్వయంతో ముందుకు వెళ్ళిన జవహర్‌కు… మంత్రి అయ్యాక కేడర్‌ను కలుపుకు వెళ్ళటంలో తీవ్రమైన ఇబ్బందులకు గురి అయ్యారు. నియోజకవర్గంలో జవహర్ అనుకూల… వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలిపోయింది. ఆయన మంత్రిగా మంచి మార్కులు తెచ్చుకున్నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మాత్రం సొంత పార్టీ కేడర్‌లోనే మైనస్ మార్కులు వేయించుకున్నారు.
ఇద్దరూ ఓడిపోయి…..
చివరకు జవహర్‌కు కొవ్వూరు సీటు ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని రోడ్డెక్కి పెద్ద యుద్ధమే చేసింది. చివరకు చంద్రబాబు సైతం కొవ్వూరు టిడిపి తమ్ముళ్ళు ఒత్తిడికి తలొగ్గి జవహర్‌ను ఆయన సొంత నియోజకవర్గమైన తిరువూరు నుంచి రంగంలోకి దింపారు. కొవ్వూరులో చంద్రబాబు మరో ప్రయోగం చేశారు. విశాఖ జిల్లా పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత కొవ్వూరు నుంచి పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో కొవ్వూరులో అనిత, తిరువూరులో జవహర్ ఇద్దరు ఓడిపోయారు. కొవ్వూరులో పార్టీ కేడర్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్న జవహర్ జిల్లా మారి తిరువూరు నుంచి పోటీ చేసినా ఆయన రాత మాత్రం మార్చుకో లేకపోయారు.
టీడీపీ క్యాడర్ సహకరించక…..
ఇదిలా ఉంటే తిరువురిలోనూ టిడిపి క్యాడర్‌లో చాలా మంది జవహర్‌కు ఈ ఎన్నికల్లో సహకరించలేదు. తిరువూరు సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాసు వర్గం జవహర్‌కు మనస్ఫూర్తిగా సహకరించకపోవడం కూడా పెద్ద మైనస్ అయింది. ఎన్నికల్లో స్వామిదాసుకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో ఇప్పుడు స్వామిదాసు కూడా తిరువూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కోసం పావులు కదపడం మొదలెట్టేశారు. స్వామిదాసు తిరువూరు నియోజకవర్గంతో రెండున్నర దశాబ్దాల అనుబంధం ఉంది.
ఇక్కడా అదే పరిస్థితి…..
ఇప్పుడు చంద్రబాబు స్వామిదాసును కాదని జవహర్‌ను నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగిస్తే స్వామిదాసు, ఆయన వర్గం జవహర్ కు సపోర్ట్ చేస్తారా ? లేదా ఆయన వేరు కుంపటి పెడతారా? పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఏదేమైనా అయిష్టంగా తిరువూరు నుంచి పోటీ చేసిన జవహర్‌కు ఇప్పుడు రాజకీయంగా కొవ్వూరులో ఎదురైన పరిస్థితే ఇక్కడా ఎదురవుతోంది. నాన్ లోకల్ గా కొవ్వూరులో జవహర్‌ను వ్యతిరేకించిన తెలుగు తమ్ముళ్లు… ఆయన సొంత నియోజకవర్గానికి వచ్చినా చాలా ఏళ్ల తర్వాత ఇక్కడకు వచ్చి తమ మీద పెత్తనం చెలాయించాలని చూస్తే ఎలా ఊరుకుంటాం ? అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో జవహర్ తిరువూరులో ఎలాంటి రాజకీయం చేయబోతారు అన్నది ఆసక్తిగా ఉంది.