వాళ్లు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కుదరదు: చంద్రబాబు

వాలంటీర్‌ వ్యవస్థపై ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై

Update: 2023-07-12 10:48 GMT

వాలంటీర్‌ వ్యవస్థపై ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా.. పవన్ కళ్యాణ్ వాలంటీర్‌ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వాలంటీర్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని, వారి సేవలు ప్రజాసేవకే పరిమితం కావాలని పేర్కొన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం పట్ల చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజల గోప్యతకు ముప్పు, దీని వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని అన్నారు.

టీడీపీ అధికారంలోకి వస్తే వలంటీర్ల సేవలను ప్రజాసేవకే వినియోగించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. అవినీతి చేయాలని జగన్‌కు ఏసుక్రీస్తు చెప్పారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ లక్షల కోట్లు అప్పు చేసి.. ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. తన పాలనా పరిస్థితులను, సీఎం జగన్‌ పాలనా పరిస్థితులను ప్రజలు ఇప్పటికే బేరీజు వేసుకున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో భవిష్యత్‌కు గ్యారెంటీ కింద.. పల్లె నిద్ర కార్యక్రమాలు చేపడతానన్నారు.

మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందంటూ కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ.. ఎవరో చెప్పిన వాటికి తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరెవరో మాట్లాడిన వాటిపై స్పందించి చులకన కాదల్చుకోలేదని అన్నారు. ఏపీ విద్యుత్ విధానాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంస్కరణలు తీసుకువస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. పెద్ద బాధ్యత తనపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరమన్నారు. పోరాడితే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ అని అన్నారు. ఓట్ల అవకతవకలపై ఢిల్లీ వరకు వెళ్లి పోరాడతామని అన్నారు. 

Tags:    

Similar News