Raithu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. నేడు క్లారిటీ ఇవ్వనున్న కాంగ్రెస్ సర్కార్

రైతు భరోసా నిధులపై నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. శాసనసభలో దీనిపై చర్చ సందర్భంగా పూర్తి వివరాలను అందించే అవకాశాలున్నాయి.

Update: 2024-12-19 08:20 GMT

రైతు భరోసా నిధులపై నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. శాసనసభలో దీనిపై చర్చ సందర్భంగా పూర్తి వివరాలను అందించే అవకాశాలున్నాయి.రైతు భరోసా నిధులను వచ్చే సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు సభలో చేసే ప్రకటనప్రాధాన్యత సంతరించుకుంది. రైతు భరోసా కింద జనవరి నెల రెండో వారంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన వారందరికీ రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు వారికి వెంటనే డబ్బులు పంపినట్లు మెసేజ్ లు కూడా పంపితే బాగుంటుందని రేవంత్ ఇప్పటికే సూచించారు.


ఇచ్చిన హామీ మేరకు...

తొలి విడతగా ఎకరానికి ఏడున్నర వేల రూపాయలు రైతు భరోసా కింద విడుదల చేయనున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద రైతులకు అందచేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో ఎకరానికి 7,500 రూపాయలు చెల్లించేందుకు సిద్ధమయింది. ఇప్పటి వరకూ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో రైతు భరోసా నిధులను కూడా జమ చేస్తుందన్న నమ్మకం ఉందని పాలక పక్షంలో అభిప్రాయం ఉంది. అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చవిత్తనాలు, పురుగు మందులు, ఎరువులుకొనుగోలు చేయడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది.
ముహూర్తం దగ్గర పడుతుండటంతో...
అయితే రైతు భరోసా నిధులు విడుదల చేసే తేదీ దగ్గర పడటంతో దానికి సంబంధించిన విధివిధానాలు కూడా తయారు అయినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనిని ఆమోదించినట్లు తెలిసింది. . మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రి వర్గ ఉప సంఘం ఇప్పటికే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను చెల్లించేవారికి రైతు భరోసా నిధులు జమచేయకూడదని నిర్ణయం జరిగిపోయింది. దీంతో పాటు పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. కేవలం సాగవుతున్న భూములకు మాత్రమే ఇవ్వాలని, కౌలు రైతులకు కూడా సాయం ఇప్పుడే అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలసాయంపపైనే నేడు రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశముందని తెలిసింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News