Bhogi Festival : తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో భోగి పండగ వేడుకలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి.;
తెలుగు రాష్ట్రాల్లో భోగి పండగ వేడుకలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. భోగి పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి పిల్లలు, పెద్దలు ఇంటి ముందు భోగిమంటలు వేశారు. ఉదయాన్నే ఇంటి ముందు రంగవల్లులులను తీర్చిదిద్దారు. ఉదయాన్నే భోగిమంటలు వేసిన అనంతరం తల స్నానం చేసి దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. సంక్రాంతిభోగి పండగ కోసం ఇప్పటికే నగరం నుంచి పల్లె బాట పట్టారు.
నగరం, పల్లెల్లోనూ...
లక్షలాది మంది జనం పల్లెలకు చేరుకున్నారు. ఇక హరిదాసుల సందడి కూడా నెలకొంది. బసవన్నలు ఇంటింటికీ వచ్చి దీవెనలు ఇచ్చి ఇచ్చింది తీసుకుని వెళ్తుంటారు. సంక్రాంతికి వచ్చే ముందు రోజు భోగి పండగ కావడంతో పాత సామాగ్రి మొత్తాన్ని భోగి మంటల్లో వేసి చలి కాచుకున్నారు. ఈ కాలంలో చలి నుంచి కాపాడుకోవడానికి ఎప్పటి నుంచో ఈ సంస్కృతి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. పిల్లలు, పాపలు, పెద్దలు అందరూ కలసి నేడు భోగి పండగను జరుపుకున్నారు.