Sankranthi Holidays : నేటి నుంచి బడులకు తాళాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది;
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రారంభమవుతున్నాయి. దీంతో తెలంగాణలో వారం రోజులు పాటు, ఆంధ్రప్రదేశ్ లో పది రోజుల పాటు విద్యాసంస్థలు మూత బడనున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలో పది రోజులు...
తెలంగాణలో ఈ నెల 16వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. తిరిగి ఈ నెల 17వ తేదీన విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పెద్ద పండగ కావడంతో పది రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఏపీలో విద్యాసంస్థలు ఈ నెల 19 వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతబడనున్నాయి.