Sankranthi : సంక్రాంతి మూడు రోజులు పండగ ఇలా చేసుకోవాలట

సంక్రాంతి పండగ అంటే మూడు రోజుల పండగ.;

Update: 2025-01-13 12:45 GMT

సంక్రాంతి పండగ అంటే మూడు రోజుల పండగ. అందుకే ఈ మూడు రోజులు పండగ చేసుకోవడానికి విదేశాల నుంచి కూడా మనోళ్లు వస్తారు. సంక్రాంతి పండగ అంటే గొబ్బెమ్మలు, ముగ్గులు, భోగిపండ్లు,హరిదాసులు, కనుమరోజు కమ్మటి విందు భోజనాలు ఇవీ. అయితే సంక్రాంతి అంటే పెద్దలు అనేకరకాలుగా చెబుతుంటారు. అందులో మూడు రోజుల పండగలో ఎన్నో విశేషాలు.. ఎన్నో విషయాలు.


భోగి : భోగి అంటే భోగం అనుభవించే రోజు అని అర్ధం, పౌష్య లక్ష్మి (పుష్య మాసం) ధాన్యం రైతు ఇంటికి వస్తుంది అది చూసి రైతు సంతోషం గా ఉంటాడు, గడ్డి గాధం వస్తుంది కాబట్టి పశు ప్రాణులు సంతోషం గా ఉంటాయి కాబాట్టి భోగం అనుభవించే రోజు కాబట్టి భోగి అంటారు. ఇంకో పేరు ఆనంద భొవిందము అని అంటారు, భోగి కి తిది ఉండదు ఎందుకంటే దక్షిణాయం ఏ తిధి నాడు పూర్తి అవుతుందో అది భోగి. దక్షిణయాం లో ప్రకృతి సహకరించదు వానలు వరదలు మంచు లాంటివి ఉంటాయి అందుకే ఆ సమయం లో ఉపాసన చేసి దేవుని కటాక్షం పొందాలంటారు. 
గొబ్బెమ్మలు : సంక్రాంతి కి నెలరోజుల ముందు నుండి కన్నె పిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టీయటం ఆనవాయితీ, కన్నె పిల్లలు ఎందుకు అంటే మగ పిల్లలు ఒక్క వంశానికి మాత్రం ఈ వృద్ధి లోకి తీసుకొని రాగలరు. అదే ఆడ పిల్లలు రెండు వంశాల వృద్ధికి కి తోడ్పడతారు అని చెబుతారు. ఎందుకంటే గొబ్బెమ్మ లక్ష్మి స్వరూపం. దానికి ఒక పురాణ కథ ఉంది. ఒక నాడు లక్ష్మి దేవి గోవుల దెగ్గరకు వెళ్లి అడిగింది మిమ్మల్ని అందరు పూజిస్తారు మీలో నాకు స్థానం కల్పించండి అని అడిగింది. అప్పుడు గోవులు అన్నాయ్ నువ్వు చంచల లక్ష్మి వి వెళ్ళిపోతూ ఉంటావ్ మా దెగ్గర వొద్దు అన్నాయట. అప్పుడు లక్ష్మి దేవి అంది నేను అలా వెళ్లిపోతూ ఉండాలి అదే ధర్మం, అధర్మం ఉన్న చోట నేను ఉండ కూడదు అప్పుడే ధర్మం నిలబడు తుంది అని చెప్పడంతో అప్పుడు గోవులు నువ్వు అయితే మా మల విసర్జన స్తానం నందు నువ్వు ఉండు అని చెప్పాయట. ఇలా నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలను ఎండిన తరువాత భోగి రోజున అగ్ని లో కలుపుతారు. ఎందుకు అగ్ని లో కలుపుతారు అంటే మంచి ఆలోచనలు ధార్మికమైయినా అభివృద్ధి ను అగ్ని దేవుడు ఇస్తాడని చెబుతారు.
భోగి పళ్ళు : పిల్లల లకు భోగి పళ్ళు పోస్తారు ఎందుకు అంటే గత జన్మల చెడు ఖర్మలు, పాపాలు పోవటానికి చెరుకు ముక్క, భోగి పళ్ళు, చిల్లర కలిపి తల నుండి కిందకి పోస్తారు దీని వలన పీడ పోయి భోగములు అనుభవించ వలసిన శక్తి పొందుతారు.
మకర సంక్రాంతి : సూర్యుడు మకర సంక్రాంతి లోకి ప్రవేశించుట, కాలం 2 గా ఉంటుంది దక్షిణాయం మరియు ఉత్తరాయం. దక్షిణాయం లో దేవతలు నిద్ర పోతారు, ఉత్తరాయణం లో నిద్ర లేస్తారు ఆ రోజు తెల్లవారు జామున నదీ స్నానం చేస్తే చాల పుణ్యమని చెబుతారు.
గంగిరెద్దులు : ఈ కాలం లో దానం చేయటం చాలా శ్రేష్టమని చెబుతారు. సాక్షాత్తూ మహా విష్ణువ్వు ఈ రూపం లో మన ఇళ్ల దగ్గరకు అతిధుల రూపం లో వస్తారు అని అంటారు. దానం చేసి త్యాగం చేయటం నేర్చుకో ఇది మన అభ్యున్నతి కి తోడ్పాటును కలుగచేస్తాయనిపెద్దలు చెబుతారు.
కనుమ : అందరు బాగుండాలి, అన్ని జీవరాసులు బాగుండాలి అని పక్షి పూజ పశు పూజ చేసి మనం తినే అన్నం పాయసం దానికి పెట్టి మనతో పాటు వాటి కి కూడా భోగం అనుభవించే లా చేయాలి , అందుకే పంట రాగానే కొన్ని కంకుల ను గుత్తు లా కట్టి ఇంటి బయటా దేవాలయాల్లో వేలాడ తీస్తారు అవి పక్షుల కోసం. ఇంట్లో ఉన్న పశువులను పూజిస్తారు,పూలు కడతారు అందరు అన్ని జీవ రాసులు బాగుండాలి అని అని కనుమ పండుగను చేసుకుంటారు. కనుమ రోజు నాన్ వెజ్ వంటకాలను చేసుకుని తినడం ఆనవాయితీగా వస్తుంది.


Tags:    

Similar News