Kanuma: నేడు కనుమ పండగ... ఈరోజు రాష్ట్రమంతటా

సంక్రాంతి పండగ మూడో రోజు కనుమ పండగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్నారు;

Update: 2025-01-15 01:49 GMT
third day, sankranti festival, kanuma, andhra  pradesh
  • whatsapp icon

సంక్రాంతి పండగ మూడో రోజు కనుమ పండగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్నారు. కనుమ రోజుతో పండగను ముగించేస్తారు. మూడు రోజుల పండగ నేటితో ముగియనుంది. ఇక ఈరోజు ముఖ్యంగా పశువుల పండగగా భావిస్తారు. ప్రత్యేకంగా తమ పశువులను శుభ్రంగా కడిగి వాటికి రంగులు మూసి పూజలు నిర్వహిస్తారు. తమ కుటుంబానికి పశువులు అందిస్తున్న సంపదను గుర్తు చేసుకుంటూ వారు ఈ పండగ జరుపుకుంటారు. ఈరోజు పశువులకు ఇష్టమైనఆహారాన్ని కూడా అందిస్తారు.

పశువులకు పూజలు...

కనుమ నాడు మినుమను తప్పక తినాలని భావిస్తారు. సంక్రాంతి పండగ రెండు రోజులు అంటే భోగి, సంక్రాంతి రోజున ఇళ్లలో్నాన్ వెజ్ వంటకాలు చేయరు. కానీ కనుమ పండగ రోజు మాత్రం నాన్ వెజ్ తోనే బ్రేక్ ఫాస్ట్ నుంచి అన్ని ప్రారంభిస్తారు. తమ పెద్దలకు ఇష్టమైన మాంసాహారాన్నినేడు వండుకుని కుటుంబ సభ్యులతో కలసి పెద్దలకు పూజలు నిర్వహించడడం సంప్రదాయంగా వస్తుంది. అయితే కనుమ నాడు ప్రయాణాలు చేయవద్దని పెద్దలు చెబుతారు. అందుకే ఈరోజు పెద్దగా ప్రయాణాలు పెట్టుకోరు. ఈరోజు తో మూడు రోజుల సంక్రాంతి పండగ ముగియనుంది.


Tags:    

Similar News