నేడు వెస్టిండీస్ తో టీ 20
వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ నేడు టీ 20 సిరీస్ లో ప్రారంభం కానుంది.
వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ నేడు టీ 20 సిరీస్ లో ప్రారంభం కానుంది. ఈరోజు జరిగే టీ 20 కి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. టీ20లలో వెస్టిండీస్ అగ్రస్థానంలో ఉంది. దీనిని ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమవుతుంది. జట్టులో భారీగా మార్పులు చేస్తుంది. వన్డే సిరీస్ ఆడిన సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్ లు కొనసాగనున్నారు. కేఎల్ రాహుల్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ సిరీస్ కు దూరమయ్యే అవకాశముంది మిగిలిన ఆటగాళ్లతో రోహిత్ సేన వెస్టిండీస్ ను ఢీకొంటుంది.
కసి తీర్చుకునేందుకు...
పంత్ తిరగి జట్టులోకి రానున్నారు. పంత్ ఓపెనర్ గా వచ్చే అవకాశాలున్నాయి. రవీంద్రా జడేజా కూడా ఈ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. హార్థిక్ పాండ్యా మరోసారి ఈ సిరీస్ లో కీలకంగా మారనున్నారు. ఇక వన్డే సిరీస్ ను కోల్పోయిన వెస్టిండీస్ జట్టు కసిమీద ఉంది. వన్డే సిరీస్ మొత్తాన్ని భారత్ కు అప్పగించేయడంతో టీ 20 మ్యాచ్ లలో కసి తీర్చుకోవాలని వెస్టిండీస్ భావిస్తుంది. ఈ జట్టులో టీ 20కి అలవాటు పడ్డ ఆటగాళ్లు అనేక మంది ఉండటంతో మ్యాచ్ లను తాము గెలుస్తామన్న ధీమా వ్యక్తమవుతుంది.