ఫైనల్ కు వాడిన పిచ్ అన్ ఫిట్: తేల్చేసిన రాయుడు
ఐసిసి ప్రపంచ కప్ 2023లో భారత జట్టు ఆడిన తీరుకు ప్రతి ఒక్కరూ
ఐసిసి ప్రపంచ కప్ 2023లో భారత జట్టు ఆడిన తీరుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. వరుసగా 10 గేమ్‌లు గెలిచిన తర్వాత ఫైనల్ లో ఓడిపోవడంతో టోర్నమెంట్ ను ముగించడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డాడు. మెగా గేమ్‌కు సిద్ధం చేసిన వికెట్‌ను కూడా రాయుడు ప్రశ్నించాడు. “పిచ్ నెమ్మదిగా ఉంది. అలాంటి ట్రాక్‌లో ఫైనల్ ఆడరు. ఇలాంటి ట్రాక్ అయితే బాగుండేదని ఎవరి ఆలోచనో నాకు తెలియదు. ఇది మంచి వికెట్ అయితే కాదు, ” అని రాయుడు చెప్పుకొచ్చాడు.
ఆట మొత్తం పిచ్ ఒకేలా లేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఫ్లాట్‌గా మారిందన్నాడు రాయుడు. భారతజట్టుకు సహకరించడం కోసం అలాంటి వికెట్ తయారుచేసుంటారని కొంతమంది అనుకుంటూ ఉంటారని.. కానీ ఆ స్లో వికెట్ మీద మనమే ఇబ్బందుల్లో పడ్డామన్నాడు రాయుడు. అలా జరుగుతుందని నేను ఊహించలేదు.. ఓ మంచి క్రికెటింగ్ వికెట్ రూపొందించాల్సింది. ఏ జట్టునైనా ఓడించగల సామర్థ్యం, ప్రతిభ మన దగ్గర ఉన్నాయని తెలిపాడు. ఆస్ట్రేలియా కంటే భారతజట్టు చాలా విషయాల్లో బలంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో సాధారణ పిచ్ అయినా సరిపోతుంది. ప్రపంచకప్ ఫైనల్ లాంటి కీలక సమయాల్లో అలాంటి పని చేసుండాల్సింది కాదు. ఓ మంచి క్రికెటింగ్ వికెట్ తయారు చేసి ఉంటే సరిపోయేదన్నాడు.