IPL 2024 Auction : వేలానికి అంతా సిద్ధం... కోట్లు కుమ్మరించి కొనేదెవరినో?
ఐపీఎల్ 2024 వేలానికి అంతా సిద్ధమయింది. మొత్తం పంధొమ్మిది సెట్లు ఇందుకోసం రెడీగా ఉన్నాయి.
ఐపీఎల్ 2024 వేలానికి అంతా సిద్ధమయింది. మొత్తం పంధొమ్మిది సెట్లు ఇందుకోసం రెడీగా ఉన్నాయి. ఐదు సెట్ల ఆటగాళ్ల కోసం ఈ వేలాన్ని నిర్వహించనున్నాయి. మొత్తం ఐదు సెట్ల వేలం ముగిసిన తర్వాత మాత్రమే మిగిలిన ఆటగాళ్ల కోసం వేలం జరుగుతుంది. ఈసారి వేలంలో 333 మంది ఆటగాళ్లకు వేలంలో కొనుగోలు చేయనున్నారు. ఇందులో 214 మంది భారత్ కు చెందిన వారు కాగా, 119 మంది ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. జట్టులో ఉన్న ఖాళీగా ఉన్న స్థానాలకు మాత్రమే వేలం జరుగుతుంది.
అంత మేరకే...
ఇందుకోసం ప్రతి జట్టుకు కొంత మొత్తాన్ని నిర్ణయించారు. పర్సులో నగదు అంటారు. పర్సులో ఉన్న నగదుతోనే తమకు కావాల్సిన ఆటగాళ్లను ఎంచుకుని కొనుగోలు చేయవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ పర్స్ లో నగదు 31.40 కోట్ల రూపాయలు ఉంది. ఈ మొత్తంతో ఆరు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దుబాయ్ లో జరగనున్న ఈ మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ పర్సులో అత్యధికంగా 38.15 కోట్లు, అతి తక్కువగా లక్నో సూపర్ జెయింట్స్ వద్ద 13.15 కోట్లు పర్సులో ఉన్నాయి.
77 ఖాళీలు మాత్రమే...
ఈ మొత్తంతోనే ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం 77 ఖాళీలకు ఈ వేలం జరగనుంది. ఫ్రాంచైజీల వద్ద పర్సులో న్న 263 కోట్ల రూపాయలతో ఈ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరి ఎవరు అత్యధిక ధరకు అమ్ముడు పోతారన్నది మరికాసేపట్లో తెలియనుంది. ఒక్కొక్క జట్టులో 18 మందిని మాత్రమే ఉంచుకోవాలి. గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను ఉంచుకునే అవకాశముంది. అయితే కొందరు తక్కువగా కూడా జట్టులో ఆటగాళ్లను ఉంచుకునే అవకాశముంది. మరి చూడాలి ఈసారి అత్యధికంగా ఎవరు అమ్ముడు పోతారన్నది.