Aman Sehrawat: భారత్ ఖాతాలో మరో పతకం.. కాంస్యం నెగ్గిన అమన్

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది

Update: 2024-08-09 18:09 GMT

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 57 కేజీల కాంస్య పతక పోరులో 21 ఏళ్ల అమన్ సెహ్రావత్ 13-5తో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌ను ఓడించాడు. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న భారతదేశానికి చెందిన ఏడవ రెజ్లర్‌గా నిలిచాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు గతంలో కెడి జాదవ్ (1952లో కాంస్యం), సుశీల్ కుమార్ (2008లో కాంస్యం, 2012లో రజతం), యోగేశ్వర్ దత్ (2012లో కాంస్యం), సాక్షి మాలిక్ (2016లో కాంస్యం), బజరంగ్ పునియా (2020లో కాంస్యం) రవి దహియా (2020)లు పతకాలు సాధించారు.

రౌండ్ ఆఫ్ 16లో నార్త్ మాసిడోనియాకు చెందిన వ్లాదిమిర్ ఎగోరోవ్‌పై అమన్ 10-0తో విజయాన్ని సాధించాడు. క్వార్టర్ ఫైనల్‌లో అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబాకనోవ్‌పై 12-0 టెక్నికల్ సుపీరియారిటీతో విజయం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రవి కుమార్ దహియా అదే వెయిట్ విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. ఒలింపిక్ క్వాలిఫైయర్‌ల కోసం జాతీయ ఎంపిక ట్రయల్స్‌లో అమన్ రవిని ఓడించి, పారిస్ 2024లో చోటు సంపాదించుకున్నాడు.


Tags:    

Similar News