బ్యాడ్మింటన్ లో సాత్విక్-చిరాగ్ సంచలనం
ఏషియన్ గేమ్స్ లో సాత్విక్-చిరాగ్ చరిత్ర సృష్టించారు. బంగారు పతకాన్ని
ఏషియన్ గేమ్స్ లో సాత్విక్-చిరాగ్ చరిత్ర సృష్టించారు. బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి 57 నిమిషాల్లో 21-18, 21-16తో చోయ్ సోల్గ్యు-కిమ్ వోన్హోను ఓడించారు.
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా జంట చోయి సోల్గ్యు, కిమ్ వోన్హోలను వరుస గేముల్లో 21-18, 21-16 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పురుషుల డబుల్స్ జోడీగా కూడా నిలిచింది. భారత బ్యాడ్మింటన్‌కు కొత్త శకానికి నాంది పలికింది ఈ జంట.