ట్విస్ట్ ల మీద ట్విస్టులు.. మరో నోబాల్ వివాదం.. టెన్షన్.. టెన్షన్

Update: 2022-10-30 07:58 GMT

చిన్న జట్ల మ్యాచ్ లను ఎవరు చూస్తారులే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ టీ20 మ్యాచ్ లలో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పటికే ఈ టీ20 ప్రపంచ కప్ లో పలు సంచలనాలు నమోదమయ్యాయి. ఇక ఆదివారం బంగ్లాదేశ్, జింబాబ్వే దేశాల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు.. షాకుల మీద షాకులు.. క్రికెట్ అభిమానులకు మాత్రం కావాల్సిన వినోదం లభించింది. జింబాబ్వే కు చివరి ఓవర్ లో చివరి బంతి వరకు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ అదృష్టం కలసి రాలేదు. ఆఖరి బంతికి నో బాల్ పడి.. ఫ్రీ హిట్ ఉన్నా కూడా జింబాబ్వే విజయాన్ని అందుకోలేకపోయింది. చివరికి 3 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. దీంతో బంగ్లాదేశ్ ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరాయి.

టాస్ టెలిచిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్ నజ్ ముల్ హుస్సేన్ షంటో 71 పరుగులతో రాణించడంతో బంగ్లాదేశ్ జట్టు మెరుగైన స్కోరు సాధించింది. ఇతడి తర్వాత అఫీఫ్ హుస్సేన్ చేసిన 29, కెప్టెన్ షకీబ్ 23 పరుగులతో రాణించాడు. రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబాని చెరో రెండు వికెట్లు తీశారు.
151 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుతిరిగారు. సీన్ విలియమ్స్ ఒక్కడే ధాటిగా ఆడాడు. 42 పరుగులకు 64 స్కోర్ సాధించాడు. ఆఖరి ఓవర్లలో హై డ్రామా కొనసాగింది. అప్పటికీ లక్ కలిసొచ్చినా.. బాదేవాళ్లు లేకపోవడంతో 147 పరుగుల వద్ద జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసింది. టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, మొసద్దిక్ హుస్సేన్, ముస్తఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లతో జింబాబ్వేను కట్టడి చేశారు. టస్కిన్ అహ్మద్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఆఖరి బంతికి కీపర్ స్టంప్ అవుట్ చేయగా.. బంతిని కీపర్ వికెట్ల ముందు పట్టుకోవడంతో నో బాల్ ఇచ్చారు.. అప్పటికే గెలిచేశామని సంబరపడిపోయిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు తిరిగి గ్రౌండ్ లోకి వచ్చేశారు. ఆఖరి బంతి ఫ్రీ హిట్ అయినా.. జింబాబ్వే వినియోగించుకోలేకపోయింది.


Tags:    

Similar News