జింబాబ్వే.. బంగ్లాదేశ్ ను చిత్తు చేస్తుందా..?

Update: 2022-10-30 02:27 GMT

టీ20 ప్రపంచ కప్ లో జింబాబ్వే పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే..! ఇక జింబాబ్వే తర్వాతి టార్గెట్ బంగ్లాదేశ్ అని అంటున్నారు. పెద్దగా ప్రభావం చూపకుండా టోర్నీలో ముందుకు సాగుతున్న బంగ్లాదేశ్ ను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న జింబాబ్వే నేడు తలపడుతూ ఉంది. పాకిస్తాన్‌పై అద్భుతమైన విజయం సాధించిన తర్వాత, జింబాబ్వే ఆదివారం (అక్టోబర్ 30) గబ్బాలో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. జింబాబ్వేకు ఇది ఇప్పటివరకు గుర్తుండిపోయే టోర్నమెంట్. రౌండ్ 1లో స్కాట్లాండ్, ఐర్లాండ్‌లపై ఆకట్టుకునే విజయాలు సాధించి సూపర్ 12 దశలో స్థానం సంపాదించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో చెరో పాయింట్ పంచుకున్నారు. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పాక్ ను సెమీస్ కు దాదాపు దూరం చేశారు. జింబాబ్వే కు కూడా సెమీస్ ఆశలు ఉన్నాయి. ఈరోజు బంగ్లాదేశ్ ను ఓడించి.. ఇతర జట్ల ఫలితాలపై జింబాబ్వే ఆధారపడి ఉంది.

ఈ మ్యాచ్ లో గెలిస్తే జింబాబ్వే గ్రూప్ 2లో మొదటి నాలుగు స్థానాలకు చేరువవుతుంది. తద్వారా T20 ప్రపంచ కప్ 2024కి నేరుగా అర్హత సాధిస్తుంది. 2022లో రజా ఏడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. T20Iలలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో కూడా రజా రాణిస్తాడని జింబాబ్వే చాలా ఆశలు పెట్టుకుంది.
జట్ల వివరాలు:
జింబాబ్వే స్క్వాడ్: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్(సి), మిల్టన్ షుంబా, సీన్ విలియమ్స్, సికందర్ రజా, రెగిస్ చకబ్వా(w), ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండనై చతారా, వెల్లింగ్, వెల్లింగ్ , క్లైవ్ మదాండే
బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(సి), అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్(w), తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, ఇబాదోత్రీ ఇస్లాం, ఇబాదోత్రీ , యాసిర్ అలీ, నసుమ్ అహ్మద్


Tags:    

Similar News