కరోనా నుంచి కోలుకున్న గంగూలీ.. డిశ్చార్జ్ !
బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన ఆయన.. కోల్ కతాలోని వుడ్ లాండ్స్
బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన ఆయన.. కోల్ కతాలోని వుడ్ లాండ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఆస్పత్రి నుంచి నేడు డిశ్చార్జ్ అయ్యారు. తన వాహనంలోనే నేరుగా ఇంటికెళ్లిపోయారు. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ.. కొద్దిరోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. కాగా.. కొద్దినెలల క్రితమే గంగూలీకి గుండె పోటు రావడంతో యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే.