ఫుట్ బాల్ రారాజు పీలే కన్నుమూత
15 ఏళ్ల వయస్సులోనే పీలే శాంటోస్ తరపున ఫుట్బాల్ ఆడటం ప్రారంభించాడు. 16 ఏళ్ల వయస్సులో బ్రెజిలియన్ జాతీయ జట్టులో..
ప్రపంచ లెజెండరీ ఫుట్ బాల్ ప్లేయర్ పీలే (82) కన్నుమూశారు. ఫుట్ బాల్ లో గెలిచిన ఆయన.. జీవితమనే ఆటలో మాత్రం ఓడిపోయారు. చాలాకాలంగా పెద్దపేగు క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆయన.. డిసెంబర్ 30న ఉదయం కన్నుమూశారని తెలుపుతూ.. ఆయన కుమార్తె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పీలే సారథ్యంలో బ్రెజిల్ మూడుసార్లు ఫుట్ బాల్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. 20వ శతాబ్దానికి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే. బ్రెజిల్ తరపున పీలే ఫార్వర్డ్ గా ఆడాడు. పీలే మరణం ఫుట్ బాల్ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
15 ఏళ్ల వయస్సులోనే పీలే శాంటోస్ తరపున ఫుట్బాల్ ఆడటం ప్రారంభించాడు. 16 ఏళ్ల వయస్సులో బ్రెజిలియన్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. జూలై 7, 1957న అర్జెంటీనా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో బ్రెజిల్ 2-1తో విజయం సాధించగా, పీలే ఆ మ్యాచ్లో గోల్ చేసి చరిత్ర సృష్టించాడు. ఆ సమయంలో, పీలే వయస్సు 16 సంవత్సరాల 9 నెలలు మాత్రమే. అత్యంత పిన్న వయస్కుడైన బ్రెజిలియన్ ఆటగాడిగా నిలిచాడు.
ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ లో ఓడిపోయినా.. అదే తన చివరి మ్యాచ్ గా.. చిరస్మరణీయంగా నిలిచింది. పీలే నేతృత్వంలో బ్రెజిల్ 1958, 1962, 1970లలో ప్రపంచ కప్ ను గెలుచుకుంది. మొత్తం 4 ప్రపంచ కప్ మ్యాలు ఆడిన పీలే.. మూడు మ్యాచ్ లలో గెలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పీలే జీవితంలో.. మొత్తం 1363 మ్యాచ్ లు ఆడి 1281 గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బ్రెజిల్ తరపున ఆడిన 91 మ్యాచ్ లలో 77 గోల్స్ చేశాడు.