చేతన్‌శర్మ రాజీనామా.. ఏమన్నారంటే?

చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బీసీసీఐకి రాజీనామా చేశారు. బీసీసీఐ కూడా ఆయన రాజీనామాను ఆమోదించింది

Update: 2023-02-17 06:24 GMT

చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బీసీసీఐకి రాజీనామా చేశారు. బీసీసీఐ కూడా ఆయన రాజీనామాను ఆమోదించింది. ఇటీవల ఒక మీడియా సంస్థ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో బయటకు రావడంతో తనంతట తాను బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు...
వెంటనే బీసీసీఐ చేతన్ శర్మ రాజీనామాను కూడా ఆమోదించింది. ప్రధానంగా ఈ స్ట్రింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, క్రికెటర్ విరాట్ కొహ్లీల మధ్య వివాదం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గత నెలలోనే చేతన్ శర్మను చీఫ్ సెలక్టర్ గా నియమించారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన పదవికి ముప్పు తెచ్చుకున్నారు. ఆయన రాజీనామాతో కొత్త చీఫ్ సెలక్టర్ ను బీసీసీఐ ఎంపిక చేయాల్సి ఉంది.


Tags:    

Similar News