ఐఓసీ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందోచ్
లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను కూడా చేర్చేశారు. క్రికెట్ ను ఒలింపిక్స్ లో
లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను కూడా చేర్చేశారు. క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చడం గురించి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. 128 ఏళ్ల తర్వాత మళ్లీ క్రికెట్ ఒలింపిక్స్‌లో భాగం కానుంది. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోసీ క్రీడలను కూడా 2028 ఒలింపిక్స్‌లో చేర్చారు. "లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఐదు కొత్త క్రీడలను చేర్చాలనే ప్రతిపాదనను ఐవోసీ సెషన్ ఆమోదించింది. క్రికెట్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోసీ వంటి క్రీడలు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఉంటాయి’’ అని ఒలింపిక్ కమిటీ ఎక్స్(ట్విటర్)లో తెలిపింది.
సోమవారం ముంబైలో జరిగిన ఇంటర్ననేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సదస్సులో ఓటింగ్ నిర్వహించారు. కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఈ క్రీడలను చేర్చే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మిగితా సభ్యులందరూ అంగీకారం తెలిపారు. దీంతో ఈ ఐదు క్రీడలను 2028 ఒలింపిక్స్‌లో ఆడించనున్నారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు.