పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు వీసాలొచ్చేశాయి

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు, టీమ్ మేనేజ్ మెంట్ కు భారత్ వీసాలను మంజూరు చేసింది

Update: 2023-09-25 17:22 GMT

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు, టీమ్ మేనేజ్ మెంట్ కు భారత్ వీసాలను మంజూరు చేసింది. సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి దుబాయ్ మీదుగా పాక్ జట్టు భారతదేశానికి రానుంది. దుబాయ్ నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ కు చేరుకోనుంది. భారత్ వీసాలను మంజూరు చేయకపోవడంతో ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. ప్రపంచకప్ సమయంలో పాకిస్థాన్ పట్ల భారత్ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని లేఖలో పీసీబీ ఆరోపించింది. 29వ తేదీన హైదరాబాద్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్న సమయంలో కూడా ఇంత వరకు వీసాలు మంజూరు చేయలేదని పాక్ చెప్పడంతో భారత్ వీసాలను మంజూరు చేసింది.

పాక్ జట్టు భారత్ వీసాల కోసం సెప్టెంబర్ 19న దరఖాస్తు చేసుకుంది. పాక్ జట్టు హైదరాబాద్‌కు చేరుకునే ముందు దుబాయ్‌లో టీమ్-బాండింగ్ క్యాంప్‌ను నిర్వహించాలని భావించింది. అయితే ఆ క్యాంపును రద్దు చేసుకుని భారతదేశంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. అక్టోబర్ 6న జరగనున్న వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌తో తమ మొదటి మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. పాకిస్థాన్ తన మొదటి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆడనుంది. అక్టోబరు 3న ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ మ్యాచ్ లు ఆడే తేదీలు-సమయం
అక్టోబర్ 6: పాకిస్థాన్ v నెదర్లాండ్స్, హైదరాబాద్, మధ్యాహ్నం 2 గంటలు
అక్టోబర్ 10: పాకిస్థాన్ v శ్రీలంక, హైదరాబాద్, మధ్యాహ్నం 2గంటలు
అక్టోబర్ 14: పాకిస్థాన్ v భారత్, అహ్మదాబాద్, మధ్యాహ్నం 2 గంటలు
అక్టోబర్ 20: పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, బెంగళూరు, మధ్యాహ్నం 2 గంటలు
అక్టోబర్ 23: పాకిస్థాన్ v ఆఫ్ఘనిస్తాన్, చెన్నై, మధ్యాహ్నం 2 గంటలు
అక్టోబర్ 27: పాకిస్థాన్ వర్సెస్ సౌతాఫ్రికా, చెన్నై, మధ్యాహ్నం 2గంటలు
అక్టోబర్ 31: పాకిస్థాన్ v బంగ్లాదేశ్, కోల్‌కతా, మధ్యాహ్నం 2 గంటలు
నవంబర్ 4: పాకిస్థాన్ v న్యూజిలాండ్, బెంగళూరు, ఉదయం 10:30 గంటలు
నవంబర్ 11: పాకిస్థాన్ v ఇంగ్లాండ్, కోల్‌కతా, మధ్యాహ్నం 2 గంటలు


Tags:    

Similar News