ENGvsAUS:రెచ్చిపోయిన హెడ్.. సామ్ కుర్రాన్ వేసిన ఒకే ఓవర్‌లో 30 పరుగులు

సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో స్టార్ ఆస్ట్రేలియన్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పవర్-హిటింగ్‌ తో రెచ్చిపోయాడు.

Update: 2024-09-12 02:25 GMT
సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో స్టార్ ఆస్ట్రేలియన్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పవర్-హిటింగ్‌ తో రెచ్చిపోయాడు. సామ్ కుర్రాన్ వేసిన ఒకే ఓవర్‌లో 30 పరుగులు బాదడమే కాకుండా, 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. హెడ్ ​​కేవలం 23 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. పవర్‌ప్లేలోనే ఆస్ట్రేలియా 86 పరుగులు చేయడంతో ఆసీస్ కు శుభారంభం దక్కింది. కుర్రాన్ ఓవర్‌లో, హెడ్ మూడు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు. హెడ్ మొత్తం ​​నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్లతో 19 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. 23 బంతుల్లో 59 పరుగుల వద్ద సకిబ్ మహమూద్ బౌలింగ్‌లో జోర్డాన్ కాక్స్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ ఏడాది T20ల్లో హెడ్ తిరుగులేని ఫామ్ లో రాణిస్తున్నాడు. 181.36 స్ట్రైక్ రేట్‌తో 1,411 పరుగులు చేశాడు.
ఇక హెడ్ అవుట్ అయ్యాక మరో ఆసీస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ 26 బంతుల్లో 41 పరుగులు చేశాడు. జాష్ ఇంగ్లిష్ 37 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. లియామ్ లివింగ్ స్టన్ 3 వికెట్లు, జొఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, సాకిబ్ మోహమూద్ 2 వికెట్లు తీసి ఆసీస్ ను దెబ్బతీశారు. 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆసీస్ అవుట్ అయింది. ఇక ఛేజింగ్ లో ఇంగ్లండ్ పెద్దగా రాణించలేకపోయింది. 19.2 ఓవర్లు మాత్రమే ఆడి 151 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆసీస్ 28 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో నిలిచిన ఆస్ట్రేలియా, శుక్రవారం కార్డిఫ్‌లో జరిగే రెండో టీ20లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.


Tags:    

Similar News