టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ వర్షార్పణం అయితే, అప్పుడు మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజున నిర్వహిస్తారు. సోమవారం రిజర్వ్ డే నాడు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ నిర్వాహకులు నియమావళిని మార్చారు. రిజర్డ్ డే రోజున అదనంగా రెండు గంటల సమయాన్ని ఆటకు కేటాయించారు. మ్యాచ్ కనీసం పది ఓవర్లు జరిగితేనే విజేతను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇరు జట్లు పది ఓవర్లు ఆడకుంటే అప్పుడు ఇద్దర్నీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. రిజర్వ్ డేకు అదనపు సమయం ఇవ్వాలని ఈవెంట్ టెక్నికల్ కమిటీ నిర్ణయించింది. మెల్‌బోర్న్ పిచ్ పేస్, బౌన్స్‌కు సహకరించనుంది.