ఓడిన పాక్.. ఫైనల్‌కు శ్రీలంక

భారత్ - శ్రీలంక మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఆదివారం ఆసియా కప్ ఫైనల్స్ జరగనున్నాయి.

Update: 2023-09-15 02:42 GMT

ఆసియా కప్ ఫైనల్ పోరు ఎవరితోనో అన్నది తేలి పోయింది. భారత్ - శ్రీలంక మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఆదివారం ఆసియా కప్ ఫైనల్స్ జరగనున్నాయి. ఫైనల్స్ చేరడానికి శ్రీలంక, పాకిస్థాన్ తెగ ప్రయత్నించాయి. అయితే హోంపించ్ కావడంతో లంకదే చివరికి పై చేయి అయింది. పాకిస్థాన్ ఇంటి దారి పట్టింది. సొంత మైదానంలో ఆడుతుండటం శ్రీలంకకు కలసి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 252 పరుగులు చేసింది. ఏడు వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ 252 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం పడటంతో కాసేపు ఆటనిలిచి పోయింది.

మెరిసిన మెండీస్...
తర్వాత డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 42 ఓవర్లలో 252 పరుగులు చేసింది. అయితే ప్రతి క్షణం ఉత్కంఠగానే సాగింది. కుశాల్ మెండీస్ 91 పరుగులు చేసి శ్రీలంకకు విజయం దక్కించారని చెప్పాలి. సమర విక్రమ 48, అసలంక 49 పరుగులు చేయడంతో శ్రీలంక స్కోరు బోర్డు పరుగులు తీసింది. అయితే వరసగా వికెట్లు పడుతుండటం కొంత ఆందోళన కల్గించింది. ఒక దశలో పాక్ గెలుస్తుందేమోనని అనిపించింది. అయితే ఎట్టలకేలకు లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక బ్యాటర్లు సక్సెస్ అయ్యారు. మెండిస్ కు మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ అవార్డు లభించింది.
ఆదివారం ఫైనల్స్...
దీంతో ఆదివారం శ్రీలంక - భారత్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. 11వ సారి శ్రీలంక ఫైనల్స్ లోకి వచ్చింది. ఈరోజు బంగ్లాదేశ్ తో భారత్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అది నామమాత్రమే. గెలిచినా, ఓడినా భారత్ ఫైనల్స్ లో శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక, భారత జట్లు బలంగా ఉన్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో ఫైనల్స్ పేరు ఆసక్తికరంగా సాగనుంది.


Tags:    

Similar News