నేడు ఇండియా - దక్షిణాఫ్రికా తొలి టీ 20
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య తొలి టీ 20 నేడు తిరువనంతపురంలో జరగనుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ ను గెలుచుకున్న జోరు మీదున్న టీం ఇండియా నేడు మరో సిరీస్ కు సిద్ధమయింది. నేటి నుంచి దక్షిణాఫిక్రికా టీ 20 సిరీస్ ప్రారంభం కానున్నాయి. ప్రపంచ కప్ కు ముందు దీనిని ప్రాక్టీస్ సెషన్ గా చూడాల్సి ఉంది. భారత్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య తొలి టీ 20 నేడు తిరువనంతపురంలో జరగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
బలహీనతలివే....
భారత్ బౌలింగ్ లో కొంత బలహీనంగా ఉంది. డెత్ ఓవర్లలో భారత్ బౌలర్లు అంచనాకు మించి పరుగులు ఇచ్చుకుంటున్నారు. దీని వల్ల లక్ష్యం పెరగడంతో పాటు విజయావకాశాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ సమస్య నుంచి టీ ఇండియా బయటపడాల్సి ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టును తేలిగ్గా కొట్టిపారేయలేం. అది సూపర్ ఫామ్ లో కొనసాగుతుంది. దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన సిరీస్ లో భారత్ విజయం సాధించలేకపోయింది. ప్రపంచకప్ లోనూ భారత్ దక్షిణాఫ్రికాతో తలపడనుండటంతో ఈ సిరీస్ భారత్ కు ఎంతో ముఖ్యమైనదని క్రీడా పండితులు చెబుతున్నారు.