సురేష్ రైనాకు పితృ వియోగం !
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పితృవియోగం కలిగింది. రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా ఆదివారం మరణించారు. కొంతకాలంగా
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పితృవియోగం కలిగింది. రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా ఆదివారం మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. ఘజియాబాద్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. త్రిలోక్ చంద్ మిలటరీలో దేశానికి సేవలందించారు. ముఖ్యంగా ఆయన పేలుడు పదార్థాలను తయారు చేయడంలో నేర్పరి. జమ్ము కాశ్మీర్ లోని రైనావారీ గ్రామానికి చెందిన త్రిలోక్ చంద్.. సురేష్ రైనా చిన్నతనంలోనే ఉత్తర్ ప్రదేశ్ లోని మురాద్ నగర్ కు వచ్చి స్థిరపడ్డారు.
టీమిండియాలో ఒక దశాబ్ద కాలం మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గా రాణించిన సురేష్ రైనా.. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. టీమిండియా తరపున 226 వన్డేలు, 78 టి20లు, 18 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ సీజన్లలో.. ఎక్కువ సీజన్లు సీఎస్కే తరపునే ఆడిన రైనా.. సక్సెస్ ఫుల్ బ్యాట్ మన్ గా పేరొందాడు. ఈసారి సీఎస్కే టీమ్ రైనా ను రిలీజ్ చేయడంతో.. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరిగా మెగా వేలంలో రైనా పాల్గొననున్నాడు. ఈ వేలంలో కొత్తగా చేర్చబడిన లక్నో సూపర్ జెయింట్స్ రైనా ను సొంతం చేసుకోవచ్చన్న సంకేతాలున్నాయి.