India - Australia Test Match : నేటి నుంచి ఇండియా - ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయింది. దీనిని బాక్సింగ్ డే టెస్ట్ గా పిలుస్తారు. మెల్ బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం అయింది
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయింది. దీనిని బాక్సింగ్ డే టెస్ట్ గా పిలుస్తారు. మెల్ బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం అయింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుగ బ్యాటింగ్ ఎంచుకుంది. మొత్తం ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్ట్ లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు టెస్ట్ మ్యాచ్ లు ముగిశాయి. చెరి ఒక మ్యాచ్ లో విజయం సాధించగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగో మ్యాచ్ కీలకంగా మారింది.
మార్పులు లేకుండానే...
పెద్దగా మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. అదే సమయంలో ఆస్ట్రేలియా కూడా సొంత గడ్డపై సిరీస్ ను సొంతం చేసుకునేందుకు మెల్ బోర్న్ వేదికను ఉపయోగించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం ఒక వికెట్ కోల్పోయి ఆస్ట్రేలియా 112 పరుగులు చేసింది. భారత్ బౌలర్ రవీంద్ర జడేజాకు ఒక వికెట్ లభించింది. ఈ టెస్ట్ లో గెలుపు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ